Thursday, October 17, 2013

Ramappa Temple - 2

మొదటి భాగం  Ramappa Temple - 1 తరవాయి భాగం. 
( ఫోటోలలో దాదాపు అన్నీ కంప్రెస్ చేశాను. నాకు అప్లోడింగ్ కి కాస్త వీలుగా ఉండాలని. అలానే కొన్ని మాస్టర్ ఫొటోస్ - కంప్రెస్ చెయ్యనివీ ఉంచాను. మొత్తం చదివాక - మీరు ఈ ఫోటోల మీద డబల్ క్లిక్ చేస్తే, పెద్దగా కనిపిస్తాయి. అప్పుడు బాణం గుర్తు < > కీలను వాడితే, అక్కడే ఉండి, చూస్తున్నట్లుగా ఉంటుంది. గమనించ ప్రార్థన )

ఇది రామప్ప ఆలయ శిలాశాసనం. నల్లసరం రాతితో చాలా నునుపుగా ఉంటుంది. నలుచదరమైన స్థంభం అది. రామప్ప గుడిలో ఉన్న అనేకానేక ప్రత్యేకతల్లో ఇదీ ఒకటి. మామూలుగా స్థంభం లా కాకుండా బల్లపరుపుగా ఉన్నవాటి మీద శాసనాలను ఎక్కడైనా ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ నాలుగు మూలల స్థంభం మీద శాసనాన్ని చెక్కారు. ఇలా శిలాశాసనానికి ఒక వేదిక ఏర్పాటు చేసి, చుట్టూరా ఇసుక రాతి శిలతో నాలుగు స్తంభాలు, ఒక రాతి పైకప్పు ఏర్పాటు చెయ్యటం నేను ఇక్కడే చూశాను. ఈ నిర్మాణం శిథిల గుడి ముందు, రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎడమ వైపు ఉంటుంది. 

శిలాశాసనం ఇలా ఉంటుంది. పెద్దగా చేస్తే కనిపిస్తుంది. 

ప్రాతఃకాల ఉషోదయ వెలుతురులో ఆ స్థూపం ఇలా వెలుతురుని ప్రతిఫలించింది ( Reflect ). 

స్థూపం ని ఏర్పాటు చేసిన గద్దె - భూమి మెత్తదనం వల్ల ఇలా ఒక ప్రక్కగా ఒరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ మీరు స్పష్టముగా గమనించవచ్చును. అయిననూ ఇన్ని సంవత్సరాలు ప్రకృతి పరీక్షలకు తట్టుకొని నిలబడింది. 

ఆ స్థూపం మీద ఉన్న లిపి. బహుశా అది దేవనాగరి లిపి అయి ఉండొచ్చును. మీరు పెద్దగా చేసి, చూడకుండా ఉండాలని, ఆ లిపి మీకు కనిపించాలని,  నేనే కావాలని అలా పెద్దగా ఒరిజినల్ ఫోటో సైజులో సెట్టింగ్స్ మార్చాను. 

ఎదురుగా గోపురం ఉండి కనిపిస్తున్నది శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఎడమ వైపున మీకు కనిపిస్తున్నది - పైకప్పు లేనిది నందీశ్వర స్వామి వారి గద్దె. 

ఈ ఫోటోలో మీరు రామలింగేశ్వరస్వామి ఆలయం, ప్రక్కన శిధిలాలయం, దాని ముందున స్థూపం గద్దె, ఎడమ మూలాన నందీశ్వర స్వామి గద్దె మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు నిలబడి చూస్తున్న చోటనే - మీ వెనకాల - తూర్పు ప్రవేశ ద్వారం ఉంటుంది. 

ఇదే ఆ తూర్పు ప్రవేశ ద్వారం. చాలా చిన్నగా, పశ్చిమ ద్వారం కన్నా వెడల్పు చిన్నగా ఉంటుంది. పశ్చిమ ద్వారానికి లేని శిల్పకళ ఈ ద్వారానికి ఉంటుంది. ఈ ద్వారముని   కొద్దిగా పరికించి చూస్తే, మీకు ఎన్నో రిపేరులు, కూలిన శిల్పాలని మళ్ళీ నిలబెట్టి, నిర్మించారన్న విషయం అర్థమవుతుంది. అంతా బాగానే ఉంది కానీ, ఈ ఎరుపురంగు పూయటం కొద్దిగా మింగుడు పడదు. ఇలా పూయటం వలన ఈ మధ్య కాలములో ఆ నిర్మాణం చేశారేమో అనే భ్రమ పడిపోతాం. 

ముందు కనిపిస్తున్నది నందీశ్వర స్వామి గద్దె. ఆ గద్దె కి ఎడమ ప్రక్కగా నుండి చూస్తే ఇలా మీకు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, బయట ఆనుకొని ఒక మామిడి చెట్టు, మామిడి చెట్టు మొదల్లో ఒక శివలింగం మీకు కనిపిస్తుంది. అలాగే రెండు పిల్లర్లు కూడా కనిపిస్తున్నాయి కదూ. వాటి గురించి తరవాత చెబుతాను. 

ఇదే నంది యొక్క గద్దె. చుట్టూరా ప్రదక్షిణ చెయ్యటానికి వీలుగా అన్నట్లు, కొంత వెడల్పులో రాతి బండల గట్టు ఉంటుంది. ఈ గద్దెకి పైకప్పు ఉండదు. 

దూరం నుండి చూస్తే నంది యొక్క గద్దె ఇలా ఉంటుంది.

ఆగ్నేయ మూలన నుండి ఆలయం ఇలా కనిపిస్తుంది. 

( ఇంకా ఉంది.. మూడో భాగము తప్పక చూడండి )

No comments:

Related Posts with Thumbnails